ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:19 AM

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో శనివారం ఐదుగురు మృతిచెందారు.జి.సిగడాం మం డలంలోని సంతవురిటి కూడలి, రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మహిళ, వృద్ధుడు మృతిచెందారు. నరసన్నపేట మండలంలోని చెన్నాపురానికి చెందిన మహిళ, గార మండలంలోని నిజామాబాద్‌కు చెంది న యువకుడు, శ్రీకాకుళానికి చెందిన వృద్ధురాలు చికిత్సపొందుతూ మృతిచెందారు.

జిల్లాలో వేర్వేరు ఘటనల్లో శనివారం ఐదుగురు మృతిచెందారు.జి.సిగడాం మం డలంలోని సంతవురిటి కూడలి, రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మహిళ, వృద్ధుడు మృతిచెందారు. నరసన్నపేట మండలంలోని చెన్నాపురానికి చెందిన మహిళ, గార మండలంలోని నిజామాబాద్‌కు చెంది న యువకుడు, శ్రీకాకుళానికి చెందిన వృద్ధురాలు చికిత్సపొందుతూ మృతిచెందారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ..

జి.సిగడాం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సంతవురిటి కూడలి వద్ద శనివారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. విజయనగరం జిల్లా రాజాం పట్టణ పరిధి మాదిగవీధికి చెందిన పలుసపల్లి సరోజిని(48) మతిస్థిమితం లేక శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ప్రమా దానికి గురై మృతిచెందింది. ఈమెకకు భర్త ఏసు, కొడుకు నాగ బాబు, కూతురు సుజాత ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.

పైడిభీమవరం సమీపంలో వృద్ధుడు..

రణస్థలం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పైడిభీమవరం సమీ పాన శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియన వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 ఏళ్ల వయసు గల వృద్ధుడు శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నట్టు జేఆర్‌ పురం ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

చెన్నాపురంలో మహిళ..

నరసన్నపేట, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన రావాడ చిన్నమ్ముడు (75) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందినట్లు హెచ్‌సీ దాలినాయుడు తెలిపారు. హెచ్‌సీ కథనం మేరకు.. చిన్నమ్ముడు గతనెల 28న చుట్ట కాల్చుతున్న సమయంలో ఆమె చీరకు నిప్పు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. అదేరోజు నరసన్నపేట వందపడకల ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. కుమారుడు సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. .

నిజామాబాద్‌లో యువకుడు..

గార నవంబరు 30(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ గ్రామంలో గతనెల 19న విద్యుత్‌ షాక్‌కు గురైన బెండి మహేష్‌ (23) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయినట్టు ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం మండలం బెండివానిపేటకు చెందిన మహేష్‌ నిజా మాబాద్‌ గ్రామంలో విద్యుత్‌ పనుల్లో భాగంగా స్తంభంపై షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

చీరకు నిప్పు అంటుకుని వృద్ధురాలు ..

శ్రీకాకుళం క్రైం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళానికి చెందిన ఎం.సీతారత్నం (81) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గతనెల 27న పూజ చేస్తున్న సమయంలో కర్పూరం బిల్ల వెలిగించి హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ నుంచి విశాఖ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు శ్రీకాకుళం పోలీసులు తెలియజేశారు.

Updated Date - Dec 01 , 2024 | 12:19 AM