ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేంద్ర బలగాలతో ఫ్లాగ్‌మార్చ్‌

ABN, Publish Date - Mar 17 , 2024 | 12:19 AM

రానున్న సార్వాత్రిక ఎ న్నికలు సజావుగా, ప్ర శాంతంగా జరిగేలా కేంద్ర దళాలు జిల్లాలో పని చేస్తాయని ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు.

ఫ్లాగ్‌మార్చ్‌లో పాల్గొన్న కేంద్ర బలగాలు

శ్రీకాకుళం క్రైం: రానున్న సార్వాత్రిక ఎ న్నికలు సజావుగా, ప్ర శాంతంగా జరిగేలా కేంద్ర దళాలు జిల్లాలో పని చేస్తాయని ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు. ఈ మేరకు శనివారం 150 మంది రిజర్వ్‌ పో లీసు దళాలు (ఆర్పీ ఎఫ్‌) తో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి చేపట్టిన ఫ్లాగ్‌మార్చ్‌ కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ ప్రారంభించారు. పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్‌మార్చ్‌ డే అండ్‌ నైట్‌ కూడలి మీదుగా ఏడురోడ్ల జంక్షన్‌, పాతబస్టాండ్‌ వరకు, తిరిగి ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేంద్ర దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలి పారు. దీనిలో భాగంగానే జిల్లాలో ఫ్లాగ్‌మార్చ్‌లు, రూట్‌ మార్చ్‌లు చెక్‌ పోస్టుల వద్ద వాహన తనిఖీలు వంటివి నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. జిల్లా పరిస్థితులు భౌతిక స్వరూపం, స్థితి గతులను కేంద్రా దళాలకు మ్యాప్‌ ద్వారా ఎస్పీ వివరిం చారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు. ఈ ఫ్లాగ్‌ మార్చ్‌లో ఏఎస్పీ ప్రేమ్‌ కాజల్‌, ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీ నా, ఆర్డీవో జీహెచ్‌ రంగయ్య, నగర పాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, డీఎస్పీలు వై.శృతి, ఎల్‌.శేషాద్రినాయుడు, సీఐలు ఎల్‌.సన్యాసినాయుడు, అవతారం, జి.మోహన్‌ రావు, ఆర్పీఎఫ్‌ ఎస్పీ, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 17 , 2024 | 12:19 AM

Advertising
Advertising