ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంద రోజుల్లోగా ఇళ్లు పూర్తి చేయాలి

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:37 PM

వంద రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, జిల్లా భూగర్భ జలవనరులశాఖ డీడీ బి.రమణమూర్తి, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోరారు.

మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి, చిత్రంలో ప్రత్యేకాధికారి రమణమూర్తి

పలాస, అక్టోబరు 19: వంద రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని మునిసి పల్‌ ప్రత్యేకాధికారి, జిల్లా భూగర్భ జలవనరులశాఖ డీడీ బి.రమణమూర్తి, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి కోరారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయంలో ‘మన ఇల్లు- మన గౌరవం’లో ఇళ్ల నిర్మాణంపై అధికారులు, సచివా లయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామకృష్ణా పురం, బొడ్డపాడు, తర్లాకోట గ్రామాల వద్ద నిర్మిస్తున్న గృహాలను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ తరువాత నిర్మించే ఇళ్లకు ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి రుణాలివ్వదని, లబ్ధి దారులే కట్టుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై వార్డుల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరించి వారికి పూర్తి అవగాహన కలిగించాలన్నారు. 1955 గృహాలు నిర్మిం చాల్సి ఉండ గా 310 చివరి దశలో ఉన్నాయని, మరో 207 లింటల్‌ లెవెల్‌లో ఉన్నాయని, వీటిని పూర్తి చే యించాల న్నారు. ‘మన ఇల్లు-మన గౌరవం’ లక్ష్యా లను సాధించే దిశలో అధికారు లు, సిబ్బంది విధులను నిర్వహిం చాలని ఆదేశించారు. లబ్ధిదారు లకు కావాల్సిన ఉచిత ఇసుక, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల న్నారు. అంతకు ముందు ప్రభు త్వ లే అవుట్లను అధికారులు పరి శీలించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రామారావు పాల్గొన్నారు.
త్వరితగతిన నిర్మించాలి
పలాసరూరల్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కలిగిం చాలని ఆర్డీవో కృష్ణమూర్తి ఆదేశిం చారు. పలాస మండలంలోని తర్లాకోట, బొడ్డపాడు గ్రామాలతో పాటు కోసంగిపురం కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను శనివారం ఆయన పరిశీలించారు. ఆయ నతో పాటు హౌసింగ్‌ ఏఈ వైకుంఠరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:37 PM