ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పార్టీకి నష్టం జరిగితే సహించను

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:38 PM

పార్టీకి డ్యామేజీ జరిగితే సహించేది లేదు.. సరిదిద్దుకోకుంటే సస్పెండ్‌ చేస్తానం టూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ను అమితంగా ఇష్టపడే జగన్‌ పార్టీ నేతలు ఆయనపై చేసిన ఫిర్యాదులతో చిర్రెత్తి పోయారు.

పార్టీకి నష్టం జరిగితే సహించను

ఎమ్మెల్సీ దువ్వాడకు స్పష్టం చేసిన వైసీపీ అధినేత

టెక్కలి: పార్టీకి డ్యామేజీ జరిగితే సహించేది లేదు.. సరిదిద్దుకోకుంటే సస్పెండ్‌ చేస్తానం టూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌ను అమితంగా ఇష్టపడే జగన్‌ పార్టీ నేతలు ఆయనపై చేసిన ఫిర్యాదులతో చిర్రెత్తి పోయారు. గురువారం తాడేపల్లి నివాసంలో జిల్లా వైసీపీ నాయకులతో జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్‌ మూలంగా జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి జగన్‌కు వివరించారు. ఆమెతో పాటు ఇటీవల టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన పేడాడ తిలక్‌ కూడా శ్రుతి పలికారు. దివ్వల మాధురి ఇటీవల మాట్లాడుతూ.. టెక్కలి ఇన్‌చార్జి పదవి మేము వేసిన భిక్ష.. ముష్టి అని మాట్లాడిన వీడియో అంశం, అలాగే గురువారం తిలక్‌ రూ.50 కోట్ల అవినీతిపరుడని, వేరొకరి పేరుతో సోషల్‌ మీడియాలో విడుదలైన మేటర్‌ వెనుక మాధురి హస్తముందని తిలక్‌ జగన్‌కు వివరించారు. ఆమెకు చెప్పు.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడు అని అనగా ఆమె ఎవరి మాట వినదని శ్రీనివాస్‌ అనడంతో జగన్‌ మరింత అసహనం వ్యక్తంచేశారు. నీవు ఎవరితో ఉంటావో స్పష్టం చేయు.. వారిని కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత నీదేనంటూ స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టకుంటే పరిణామాలు మారుతాయని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని జగన్‌ చెప్పు కొచ్చారు. 2029లో తాను ముఖ్యమంత్రిగా ఉండాలంటే టెక్కలి అసెంబ్లీ బరి నుంచి పేడాడ తిలక్‌, పార్లమెంట్‌ బరి నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేస్తారని, వారిని గెలిపించుకుని వస్తేనే.. నీ ఎమ్మెల్సీ పదవిపై మాట్లాడుకుందాం అంటూ దువ్వాడకు కరాఖండిగా స్పష్టం చేశారు. ఈ ఘటనతో వైసీపీ నాయకులు తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్‌, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పిరియా విజయ, నర్తు రామారావు నిశ్చేష్టులయ్యారు.

Updated Date - Sep 21 , 2024 | 12:25 AM