ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:14 AM

స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఉన్న కొత్త చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో రెవెన్యూ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. ఇక్కడ అడుగు రూ.రెండు లక్షలకు పైగా పలుకుతోంది.

అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్న సిబ్బంది

- అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

మెళియాపుట్టి: స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఉన్న కొత్త చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతుండడంతో రెవెన్యూ అధికారులు బుధవారం అడ్డుకున్నారు. ఇక్కడ అడుగు రూ.రెండు లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఖాళీ జాగా కనిపిస్తే చాలు..అక్రమార్కులు పాగా వేసేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు అక్రమణ నిర్మాణాలను అడ్డుకొనే పరిస్థితులు లేకపోవటంతో ఆక్రమణదారులు చెలరేగిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆక్రమణరుల్లో కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయి తమ పని కానిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అడ్డుకోకపోవడంతో వీరు ఆడిందే ఆటగా మారిపోయింది. ఈ క్రమంలోనే బుధవారం రూ.20 లక్షల విలువైన స్థలంలో నిర్మాణాలకు కొందరు సిద్ధపడడంతో వీఆర్‌వో కోటేశ్వరావు వెళ్లి పరిశీలించారు. సర్వే నెంబర్‌ 348 చెరువు పోరంపోగుగా రికార్డుల్లో ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. నిర్మాణాలకు సిద్ధమైన వారు ఒక డీ పట్టా చూపించారని, అది నకిలీదిగా గుర్తించినట్లు తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని వివరించారు. అంతవరకు పనులు నిలుపుదల చేయలని ఆదేశించినట్లు చెప్పారు. చెరువు గర్భాన్ని మరికొంతమంది ఆక్రమించినట్టు గుర్తించామని, వీటిని తొలగిస్తామని తెలిపారు.

Updated Date - Sep 12 , 2024 | 12:14 AM

Advertising
Advertising