రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:13 AM
సురంగిరాజా మై దానాన్ని పూర్తి స్థాయిలో అభివృ ద్ధికి కృషి చేస్తాన ని, ప్రస్తుతం రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు.
ఇచ్ఛాఫురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) సురంగిరాజా మై దానాన్ని పూర్తి స్థాయిలో అభివృ ద్ధికి కృషి చేస్తాన ని, ప్రస్తుతం రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. శుక్రవారం సురంగి రాజా మైదానాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఇండోర్ స్టేడియం నిర్మాణంతో పాటు ఆట పరికరాలు సమకూరుస్తానన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ దాసరి రాజు, టీడీపీ నాయకులు కొండా శంకర్‌రెడ్డి, కాళ్ల దిలీప్, లీలారాణి, విశ్వనాథం పాల్గొన్నారు. కాగా విప్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి ఇచ్ఛాపురం వచ్చిన ఎమ్మెల్యేను పట్టణానికి చెందిన ఎలియన్స్ క్లబ్ సభ్యులు సత్కరించారు.
ఆక్రమణలు తొలగించండి
సురంగి రాజా మైదానం ఆక్రమణలకు గురైనట్టు నా దృష్టికి వచ్చిందని, వెంటనే సర్వే చేయించి ఆక్రమణలు తొలగించాలని తహసీల్దార్ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్‌ను ఎమ్మెల్యే అశోక్ ఆదేశించారు. మైదానానికి ఆనించి ఉన్న గృహాల వాడుక నీరు పైపులను తొలగించాలన్నారు.
- కవిటి: కె.కొత్తూరు గ్రామంలోని గారమ్మతల్లి ఆలయ వార్షికోత్సవంలో ప్ర భుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులు బి.రమేష్, పి.కృష్ణారావు, బి.తిరుమలరావు, ఎ.మధు, ఎ.రాజు, వి.రంగారావు ఉన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:13 AM