క్రీడలపై ఆసక్తి పెంచాలి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:21 AM
చదు వుతో పాటు క్రీడలపై ఆసక్తి కన్పరిచాలని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి, ఏఎంవో ఎన్.సంజీ వరావు అన్నారు.
ఎచ్చెర్ల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): చదు వుతో పాటు క్రీడలపై ఆసక్తి కన్పరిచాలని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శి, ఏఎంవో ఎన్.సంజీ వరావు అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో గురువారం జోన్-1 బాలికల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా పాల్గొన్న ఆయన మాట్లా డుతూ క్రీడల్లో రాణించడం ద్వారా ప్రయోజనం ఉంటుం దన్నారు. నాలుగు రోజులు పాటు జరగనున్న ఈ పోటీ ల్లో ఉమ్మడి మూడు జిల్లాల నుంచి 21 గురుకుల పాఠశా ల/కళాశాలలల నుంచి 800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. 6 గేమ్స్, 11 స్పోర్ట్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో డీఈవో ఎస్.తిరుమల చైతన్య, ఇంటర్మీడియట్ విద్య ఆర్‌ఐవో పి.దుర్గారావు, డీవీఈవో ఎస్.తవిటినాయుడు, ఎన్‌వైకే కో ఆర్డినేటర్ ఉజ్వల్, డీటీవో నారాయణరావు, గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త బాలాజీ నాయక్, గురుకుల కళాశాల ప్రిన్సి పాల్ ఎస్.పద్మజ, వైస్ ప్రిన్సిపాల్ జ్యోతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:21 AM