చేనేత కార్మికులకు కలిశెట్టి అభినందన
ABN, Publish Date - Jun 02 , 2024 | 12:08 AM
హ్యాట్రిక్ సాధించనున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలిపే చేనేత వస్త్రాల నేత పనులు సకాలంలో పూర్తి చేసిన నేతన్నలను విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు.
లావేరు: హ్యాట్రిక్ సాధించనున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలిపే చేనేత వస్త్రాల నేత పనులు సకాలంలో పూర్తి చేసిన నేతన్నలను విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. శనివారం లావేరులోని చేనేత కార్మికులు బాసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను అప్పలనాయుడు స్వయంగా కలుసుకుని వస్త్రాల పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేయగలిగామని చేనేత కార్మికులు తెలిపారు. ప్రధాని మోదీ చిత్ర పటాన్ని డిజైన్ చేసి చేనేత వస్త్రాలను నేసిన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను కలిశెట్టి అభినందించారు. అలాగే ఎన్డీఏ కూటమిలో విజయం సా ధించనున్న నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లకు అభినందననలు తెలిపే చేనేత వస్త్రాలను కూడా త్వరలో పూర్తి చేయాలని చేనేత కార్మికులైన నాగేశ్వరరావు, లక్ష్మి దంపతులను ఆయన కోరారు.
Updated Date - Jun 02 , 2024 | 12:08 AM