పనిచేసిన చోటే.. కుప్పకూలి..
ABN, Publish Date - Apr 03 , 2024 | 11:53 PM
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో బుధవారం వడదెబ్బకు గురై ఉపాధిహామీ కూలీ గరుగుబెల్లి రాజులమ్మ(62) మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
- వడదెబ్బకు గురై ఉపాధికూలీ మృతి
ఆమదాలవలస, ఏప్రిల్ 3: ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో బుధవారం వడదెబ్బకు గురై ఉపాధిహామీ కూలీ గరుగుబెల్లి రాజులమ్మ(62) మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న సత్తిబంద చెరువు వద్ద ఉపాధి పనులకు రాజులమ్మ తోటి కూలీలతో కలిసి వెళ్లింది. పనులు ప్రారంభించిన కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. తోటి కూలీలు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. వడదెబ్బ కారణంగా ఆమె మృతి చెందినట్టు స్థానిక వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉపాధిహామీ క్షేత్ర సహాయకురాలు, టీడీపీ నాయకుడు ఢిల్లీశ్వరరావు, ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, ఉపాధిహామీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొర్లకోట గ్రామానికి ఏపీవో చేరుకొని మృతురాలి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
Updated Date - Apr 03 , 2024 | 11:53 PM