ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేజీబీవీ విద్యార్థినుల ఆచూకీ లభ్యం

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:23 PM

జి.సిగడాం కేజీబీవీ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ విద్యార్థినులు రెడ్డి భార్గవి, తలారి లిఖిత ఆచూకీ లభ్యమైంది. ఈమేరకు వారిద్దరూ మంగళవారం ఆమదాలవలస రైల్వేసేషన్‌లో పట్టుబడ్డారు.

కేజీబీవీలో పాఠశాల సిబ్బందితో మాట్లాడుతున్న సీఐ అవతారం

ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో గుర్తింపు

జి.సిగడాం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జి.సిగడాం కేజీబీవీ జూనియర్‌ కళాశాల ఇంటర్‌ విద్యార్థినులు రెడ్డి భార్గవి, తలారి లిఖిత ఆచూకీ లభ్యమైంది. ఈమేరకు వారిద్దరూ మంగళవారం ఆమదాలవలస రైల్వేసేషన్‌లో పట్టుబడ్డారు. ఇక్కడ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆనందపురానికి చెందిన భార్గవి, రాజాం మండలంలోని వస్త్రపురి కాలనీకి చెందిన లిఖిత సోమవారం వేకువ జామున కళాశాల గోడ దూకి అదృశ్యమైన సంగతి విదితమే. వీరిద్దరూ మంగళ వారం ఆమదాలవలస రైల్వేసేషన్‌లో పట్టుబడగా శ్రీకాకుళం సీడ బ్ల్యూసీ కార్యాల యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆమదాలవలస జీఆర్పీ పోలీసుల సహకారం, సమాచారంతో జి.సిగడాం పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి విద్యార్థుల తల్లిదండ్రు లు, కుటుంబ సభ్యులకు పాఠశాల సిబ్బంది సమక్షంలో అప్పగించారు. వసతి గృహంలో ఉండి చదువుకోవడం ఇష్టం లేకనే పాఠశాల నుంచి వెళ్లిపోయామని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. ఇద్దరం గుంటూరులో ఉంటున్న భార్గవి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పోయేందుకు సిద్ధమయ్యామని వారు తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 11:23 PM