ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పిచ్చికుక్క స్వైరవిహారం.. 27 మందికి గాయాలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:19 AM

మండల కేంద్రంలోని మహరాజా మార్కెట్‌లో బుధవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది.

పొందూరు: మండల కేంద్రంలోని మహరాజా మార్కెట్‌లో బుధవారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. మార్కెట్‌కు సరుకులు కొనుగోలు కోసం వచ్చినవారి పైనా, స్థానికులపైనా దాడిచేసింది. దీంతో 27 మందికి గాయాలయ్యాయి. వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పొందూరు గ్రామానికి చెందిన జి.అన్నాజీ, వి.వెంకటగోవిందరావు, ఆర్‌.పారారావు, గారపేటకు చెందిన యు.సుజాత, ఎ.ప్రదీప, వి.జోగలమ్మ, వి.చిరంజీవి, మజ్జిలపేటకు చెందిన వి.మల్లేశ్వరరావు తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కుక్కలు గుంపులు, గుంపులుగా సంచరిస్తుండడంతో మార్కెట్‌కు వచ్చేవారు హడలిపోతున్నారు. కుక్కల నియంత్రణకు పంచాయతీ సిబ్బంది దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:19 AM

Advertising
Advertising