ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దాడి కేసులో వ్యక్తికి జైలు

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:16 AM

పూండి గోవిందపురం గ్రామానికి చెందిన ఏర్నిబాబు అనే వ్యక్తికి ఓ కేసులో రెండేళ్ల సాధారణ జైలు, రూ.11వేలు జరిమానా విధిస్తూ శ్రీకాకుళంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చినట్టు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ సీహెచ్‌ రామారావు చెప్పారు.

వజ్రపుకొత్తూరు: పూండి గోవిందపురం గ్రామానికి చెందిన ఏర్నిబాబు అనే వ్యక్తికి ఓ కేసులో రెండేళ్ల సాధారణ జైలు, రూ.11వేలు జరిమానా విధిస్తూ శ్రీకాకుళంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చినట్టు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ సీహెచ్‌ రామారావు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్నిబాబు 2019 మార్చి 10న తన భార్యను కొట్టడంతో పొరుగింటికి వెళ్లి తల దాచుకుంది. ఆమెకు ఆశ్రయం ఇచ్చారనే కారణంతో పక్కన ఉన్న పాడల సావిత్రి కుటుంబంపై మరుసటి రోజు ఏర్నిబాబు దాడి చేసి గాయపరిచాడు. సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి హెచ్‌సీ గవరయ్య కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ ఎ .సత్యనారాయణ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసును డిప్యూటీ డైరెక్టర్‌ మెట్ట మల్లేశ్వరరావు వాదించారు. నిందితుడిపై నేరం రుజువైనందున శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎస్‌ఎం ఫణికుమార్‌ తీర్పు ఇచ్చారని ఎస్‌ఐ చెప్పారు.

వృద్ధుడు అదృశ్యం

పాతపట్నం: తెంబూరు గ్రామానికి చెందిన సందిపేట వెంకటరమణ(62) అనే వ్యక్తి ఈ నెల 10 నుంచి కనిపించడం లేదంటూ భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెళియాపుట్టిలో ఉన్న తన అక్కచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్‌ఐ బి.లావణ్య తెలిపారు.

టైపిస్ట్‌ ఆకస్మిక మృతి

పాతపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహిస్త్తున్న టి.ప్రదీప్‌కుమార్‌(34) బుధవారం ఆకస్మికంగా మృతిచెందాడు. స్థానిక టీచర్స్‌ కాలనీలో ఉంటున్న ప్రదీప్‌ బుధవారం ఉదయం అనారోగ్యానికి గురికావడంతో పాతపట్నం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం తరలించేందుకు ప్రయత్నం చేస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య చంద్రిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:16 AM

Advertising
Advertising