ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:48 PM
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
అరసవల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానం నుంచి ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు కొనసాగింది. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేయగా సమితి గౌరవ సలహాదారు కళ్లేపల్లి రామ్‌గోపాల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రపతి ఈ తీర్పును నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వర్గీకరణకు మద్దతు పలికిన ఏ రాజకీయ పార్టీకైనా తగిన మూ ల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోరాట సమితి కన్వీనర్ తైక్వాండో శ్రీను, కో కన్వీనర్ కంఠ వేణు, ప్రతినిధులు బడే కామరాజు, రాయి వేణు గోపాల్, బోనెల రమేష్ తదితరులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీఎస్‌ఎన్ మూర్తి, మల్లెల వెంకటరావు, మంచె నాగమల్లేశ్వరి, బొడ్డేపల్లి నర్సింహులు, పాల్తేటి పెంటారావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నంలో..
పాతపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ గెస్ట్‌హౌస్ నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. అక్కడ మానవహార నిర్వహించి వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనం తరం కోర్టుకూడలి వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో దళిత సంఘం పాతపట్నం మండల అధ్యక్షుడు తొగిరి లక్ష్మీ నారాయణ, సిర్ల జోగారావు, నవగాన రత్న కుమార్, యజ్జల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:48 PM