ఆదిత్యుని సన్నిధిలో ఎమ్మెల్సీ చిరంజీవి
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:53 PM
ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు.
అరసవలి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ప్రసాదాలను, స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ అందజేశారు.
- కాగా ఆదివారం ఒక్క రోజు స్వామివారికి రూ.3,03,073 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.66,000, పూజలు, విరాళాల రూపంలో రూ.38,938, ప్రసాదాల ద్వారా రూ.1,98,135 లభించినట్టు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు.
Updated Date - Dec 01 , 2024 | 11:53 PM