ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజా భాగస్వామ్యంతోనే డెంగ్యూ నివారణ

ABN, Publish Date - May 17 , 2024 | 12:04 AM

ప్రజా భాగస్వామ్యంతోనే శాత శాతం డెంగ్యూ నివారణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది.

ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో మీనాక్షి

- జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి

అరసవల్లి, మే 16: ప్రజా భాగస్వామ్యంతోనే శాత శాతం డెంగ్యూ నివారణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బొడ్డేపల్లి మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. ఈ ర్యాలీని డీఎంహెచ్‌వో మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధి వచ్చేందుకు గల కారణాలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వృఽఽథా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే రక్త, ఎలీసా వంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్థారణ అయితే వెంటనే వైద్యుని సంప్రదిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చునన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పీవీ సత్యనారాయణ, అర్బన్‌ వైద్యాధికారి లింగరాజు, జిల్లా మాస్‌ మీడియా అధికారి పైడి వెంకటరమణ, మలేరియా కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, ఎంఆర్‌కే దాస్‌, లక్ష్మి, శ్రీనివాస్‌, నరసింహం, మురళి, సాయి, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2024 | 12:04 AM

Advertising
Advertising