ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:34 PM

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో నాణ్యతాప్రమాణాలు పాటించాలని వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాథస్వామి అన్నారు.

మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామి

జలుమూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో నాణ్యతాప్రమాణాలు పాటించాలని వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాథస్వామి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యా లయ సమావేశ మంది రంలో బుధవారం సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ధాన్యం సిద్ధం చేసినట్లు సమాచారం వచ్చిన వెంట నే గ్రామ సచివాలయం సిబ్బంది టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఆపరేటర్‌ కళ్లానికి వెళ్లి తేమ, పొల్లు, చెడిపోయిన ధాన్యం శాతాన్ని గుర్తించాలన్నారు. 17 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టించి తేమ శాతం తగ్గిన తరువాత కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని సూచించార కార్యక్రమంలో సివిల్‌ సప్లై డీఎం. కె.శ్రీనివాసులు, డీడీఏ భవానీ శంకర్‌, ఏడీఏ బగ్గు రజని, సివిల్‌ సప్లై డీటీ జాఫర్‌ షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:34 PM