ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

6 వరకు ఉపాధ్యాయ ఓటర్ల నమోదు

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:42 PM

ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో ఎం.అప్పారావు తెలిపారు.

మాట్లాడుతున్న డీఆర్వో అప్పారావు

- పాత ఓటు చెల్లుబాటు కాదు

- జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో ఎం.అప్పారావు తెలిపారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల కమిషన్‌ నిబంధనలను అనుసరించి సెప్టెంబరు 30న నోటిపికేషన్‌ వెలువడింది. అదే రోజు నుంచి ఉపాధ్యాయ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 6వ తేదీలోగా నమోదు చేసుకోవాలి. నవంబరు 23న ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్‌ పబ్లిష్‌ అవుతుంది. డిసెంబరు 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తాం. 30న తుది జాబితా విడుదల చేస్తాం. దీనిపై అధికారులు దృష్టి సారించాలి. నమోదుకు ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు సెకండరీ స్థాయి నుంచి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా అర్హులే. పార్ట్‌టైమ్‌ విధానంలో పనిచేసేవారు అనర్హులు. గత ఆరేళ్లలో సెకండరీ స్థాయికి మించిన ఏ విద్యాసంస్థలో అయినా మూడేళ్లకు తగ్గకుండా పనిచేసిన ఉపాధ్యాయులు అర్హులు. పాత ఓటు చెల్లుబాటు కాదు. గతంలో ఓటు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవాలి’ అని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో తిరుమల చైతన్య, ప్రాంతీయ ఇంటర్మీడియట్‌ అధికారి తవిటినాయుడు, సి-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:42 PM