ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలుంటే తెలియజేయండి: ఆర్డీవో

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:46 PM

అంధవరం, దొంపాక గ్రామాల వద్ద వంశధార నదిలో ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని శ్రీకాకుళం ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య అన్నారు. అంధవరం, దొంపాక గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామసభలో మాట్లాడుతున్న ఆర్డీవో రంగయ్య

జలుమూరు: అంధవరం, దొంపాక గ్రామాల వద్ద వంశధార నదిలో ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని శ్రీకాకుళం ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య అన్నారు. అంధవరం, దొంపాక గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంధవరం పంచాయతీ ఉప్పరపేట వద్ద రోడ్డు బాగా పాడైందని, పక్కా రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరారు. అలాగే దొంపాక ఇసుక ర్యాంపులో స్థానికులకు పని కల్పించి ఉపాధి చూపించాలని ఆ గ్రామస్థులు కోరారు. దొంపాక ఇసుక ర్యాంపు తిమడాం పరిధిలో ఉన్నందున తిమడాం గ్రామస్థులకు కూడా ఉపాధి కల్పించాలని వారు కోరారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, పర్యావరణ పరిరక్షణశాఖ ఇంజనీర్‌ శంకరనాయక్‌, ఆర్‌.ఐ సతీష్‌కుమార్‌, మండల సర్వేయర్‌ నాగేశ్వరరావు, వీఆర్వో గోపి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:46 PM

Advertising
Advertising