అర్జీలను పరిష్కరించండి: జేసీ
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:48 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికా రులను ఆదేశించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసంలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికా రులను ఆదేశించారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమంలో డీఆర్వో ఎం.అప్పారావు, జడ్పీసీఈవో శ్రీధర రాజు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌తో కలిసి 138 అర్జీలను స్వీకరించా రు.కార్యక్రమంలో డీపీవో కె.భారతీ సౌజన్య, డీఎంహెచ్‌వో బి.మీ నాక్షి, ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డ్వామా పీడీ సుధాకరరావు, డీసీ హెచ్‌ఎస్ కళ్యాణబాబు పాల్గొన్నారు.
వైద్యమిత్రలకు సమాన వేతనం ఇవ్వాలి
డాక్టర్‌ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో 17ఏళ్లుగా పనిచేస్తున్న వైద్య మిత్రలు, టీం లీడర్లు, జిల్లా మేనేజర్లు, ఆఫీస్ అసోసియేట్లు, జిల్లా మోనటరింగ్ యూనిట్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మీసాల త్రినాథరావు, ప్రధాన కార్యదర్శి పప్పల.అప్పారావు కోరారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సోమవారం జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జేసీకి వినతిపత్రం సమర్పిం చారు.స్పష్టమైన హామీ లభించకుంటే ఈనెల 29వ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి, పూర్తిస్థాయి సమ్మెలో పాల్గొం టామని ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్టుఅండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనిన్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో కార్యద ర్శి యశోద, జ్యోత్స్న, సంధ్య, భాస్కర్, వెంకటేష్, శ్రీనివా స్, వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పదవీ విరమణ బెనిఫిట్స్ అందించండి
తనకు పదవీ విరమణ అనంతరం అందాల్సిన బెని ఫిట్స్ ఇవ్వాలని నందిగాం మండలం పెద్దినాయుడు పేటలో అంగన్‌వాడీ కేంద్రం కార్యకర్త సన్యాసమ్మ పాణి గ్రాహి కోరింది. గతఏడాది మే నెలలో పదవీ విరమణ చేసినా అనంతరం తనకు రావాల్సిన మొత్తం అందలేద ని వాపోతోంది. ఈ మేరకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసంలో వినతిపత్రం అందజేసింది.
సమస్యలను పరిష్కరించాలి
శ్రీకాకుళంక్రైం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): చట్ట ప్రకారం చర్యలు తీసుకుని సమ్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో 40 వినతులు వచ్చాయి.ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీక రించి అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:48 PM