ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శిథిల భవనం.. ఇరుకు గదులు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:40 PM

సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా ఇరుకు గదులు, శిథిలావస్థకు చేరిన భవనంలో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వస్తున్న రోగులు కూడా ఇబ్బందిపడుతున్నారు.

ఇరుకుగదిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది:

సరుబుజ్జిలి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ) సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా ఇరుకు గదులు, శిథిలావస్థకు చేరిన భవనంలో సిబ్బంది బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడకు వస్తున్న రోగులు కూడా ఇబ్బందిపడుతున్నారు. 2000లో ప్రారంభించిన ఈ భవనం నిర్వహణ లేకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇటీవల శ్లాబ్‌ పెచ్చులూడి పడిపోయిన విషయం విదితమే. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వైద్యులు సేవలందించే గది శ్లాబు పెచ్చులూడడంతో ఏ క్షణం కూలిపోతుం దోనని భయాందోళన చెందుతున్నారు. భవనంలో పలు గదులు కారిపోతు న్నాయి. వర్షం కురిస్తే సిబ్బందితోపాటు సామగ్రి తడిచిపోతున్నాయి. ప్రతిరోజూ ఇక్కడకు వంద నుంచి 150 మంది రోగులు వస్తున్నారు. రోగులకు సేవలందించే గది శిథిలావస్థలో ఉండడంతో సమావేశం గది ఇరుగ్గా ఉన్నా కొంతకాలం నుంచి రోగులకు అక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ హయాంలో రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలో రూ.60 లక్షలతో హంగులు కల్పించారు. అయితే అధికారులు, రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రతినిధులు భవన నిర్మాణ పటిష్టతను పరిశీలించకుండా రంగులు వేయడంతోపాటు సీలింగ్‌లు ఏర్పాటుచేశారు. వివిధ రకాల సామగ్రి సమకూర్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పీహెచ్‌సీ భవనంలోని గదుల నుంచి ఏ సమయంలో పెచ్చులూడి రోగులపై పడుతాయోనని భయాందోళనతో సమావేశం గదిలో వైద్య సేవలందిస్తున్నట్లు వైద్యుడు సంతోష్‌కుమార్‌ తెలిపారు. భవనం పరిస్థితిని ఉన్నతాధికారులకు ఇప్పటికే తెలియజేశామని చెప్పారు.

Updated Date - Nov 14 , 2024 | 11:40 PM