ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వర్మీ కంపోస్టు విక్రయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:49 PM

వర్మీ కంపోస్టు విక్రయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. సోమవారం శ్రీకా కుళంలోని జడ్పీ సమావేశ మందిరం బయట ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌ను పరిశీలించారు.

వర్మీ కంపోస్టును పరిశీలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): వర్మీ కంపోస్టు విక్రయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. సోమవారం శ్రీకా కుళంలోని జడ్పీ సమావేశ మందిరం బయట ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు స్టాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్మీకంపోస్టును పంచాయతీల నుంచి స్వయం సహాయక సంఘాలకు సరఫరా చేస్తే వారు విక్రయిస్తారని చెప్పారు. వర్మీ కంపోస్టు స్టాల్‌ను ఏర్పాటు చేయాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో కె.భారతి సౌజన్య పాల్గొన్నారు.

విరాళాల సేకరణ పోస్టర్‌ ఆవిష్కరణ

దేశరక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల కుటుంబాల సహాయార్థం సాయుధ దళాల పతాక దినోత్సవం కోసం విరాళాలు సేకరణ పోస్టర్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆవిష్కరించారు. అక్షర వెలుగుపుస్తకాన్ని విడుదలచేశారు. కార్యక్రమం లో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ ఖాన్‌, డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు, డీఈవో పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:49 PM