ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ పాపం.. మిల్లర్లకు శాపం..

ABN, Publish Date - Dec 02 , 2024 | 11:48 PM

వైసీపీ ప్రభుత్వ పాపం మిల్లర్లకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో మిల్లులు నడపలేని పరిస్థితి నెలకొంది. అధికారులను అడిగితే బ్యాంకు గ్యారెంటీలు కింద మినహాయిస్తామని చెబుతున్నారు.

చాపరలో ఖాళీగా ఉన్న రైస్‌ మిల్లు

-రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు

-ధాన్యం కొనుగోలుకు వెనుకంజ

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

- బకాయిలను బీజీల కింద మినహా ఇస్తామనడంతో ఆందోళన

- మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలోని ఓ రైస్‌ మిల్లు యజమానికి గత వైసీపీ ప్రభుత్వం రూ.80లక్షలు బకాయి పడింది. దీంతో ఈ ఏడాది ఎలా వ్యాపారం చేయాలో తెలియక ఆయన ఆందోళన చెందుతున్నాడు. బకాయి చెల్లించాలని అడితే ఈ ఏడాదికి సంబంధించిన బ్యాంకు గ్యారెంటీలు కింద మినయిస్తామని అధికారులు చెబుతున్నారని మిల్లు యజమాని వాపోతున్నాడు.

- చాపర గ్రామానికి చెందిన మరో మిల్లు యజమాని వైసీపీ దెబ్బకు తన రైస్‌ మిల్లుని కల్యాణ మండపంగా మార్చేశాడు. గత ఐదేళ్లలో లక్షల రూపాయల బకాయి వైసీపీ ప్రభుత్వం ఆయనకు చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా స్పందన లేకపోవడం, పైగా ఇబ్బందులకు గురిచేయటంతో తన వ్యాపారానికి స్వస్తి పలికాడు. రైస్‌ మిల్లును కల్యాణ మండపంగా మార్చేశాడు.

మెళియాపుట్టి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) వైసీపీ ప్రభుత్వ పాపం మిల్లర్లకు శాపంగా మారింది. కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో మిల్లులు నడపలేని పరిస్థితి నెలకొంది. అధికారులను అడిగితే బ్యాంకు గ్యారెంటీలు కింద మినహాయిస్తామని చెబుతున్నారు. దీంతో మిల్లులు నడపలేక.. మూసివేయలేక సతమతమవుతున్నారు. కొందరు యజమానులు తమ మిల్లులను కల్యాణ మండపాలు, ఇతర వ్యాపార కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. ధాన్యం మిల్లింగ్‌కు సంబంధించి మిల్లర్లకు సార్టెక్స్‌, డ్రయ్యర్‌, బియ్యం రవాణా, కస్టోడియన్‌, సంచుల వినియోగం, తదితర చార్జీలు చెల్లించాల్సి ఉంది. వాటి చెల్లింపుల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసుకుంటూ వచ్చింది. దీంతో గత ఐదేళ్లలో జిల్లాలో సుమారు రూ.20 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. గత ఏడాది సుమారు 250 మిల్లులు మాత్రమే ధాన్యం కోనుగోలు చేశాయి. బకాయిలు పేరుకుపోవడం తదితర కారణాలతో చాలామంది మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు బీజీలు చెల్లించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో బిల్లులు సక్రమంగా అందుతాయానే దీమా మిల్లర్లలో నెలకొంది. తమ ప్రభుత్వం రైతులతో పాటు మిల్లర్లకు న్యాయం చేస్తుందని, ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. బకాయిల సొమ్మును బ్యాంకు గ్యారెంటీల్లో కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 570 మిలర్లు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్క ధాన్యం విక్రయించిన రైతులకు కూడా 48 గంటల్లోపే బిల్లులు చెల్లిస్తోంది. వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ సర్కారు హయాంలో ధాన్యం విక్రయించిన తర్వాత నగదు కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:48 PM