కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:46 PM
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గాను అవసరమైన స్థలాన్ని శుక్రవారం తహసీ ల్దార్ టి.కల్యాణ చక్రవర్తి సిబ్బందితో కలిసి పరిశీలించారు.
పలాస, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గాను అవసరమైన స్థలాన్ని శుక్రవారం తహసీ ల్దార్ టి.కల్యాణ చక్రవర్తి సిబ్బందితో కలిసి పరిశీలించారు. సూదికొండ దిగువన 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం ఉండడం, దీనిలో ఎక్కువగా పట్టాలు మార్పిడి చేసి ఆక్రమణలకు గురైంది. సదరు స్థలాలను గుర్తించి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసు లు పెట్టాలని తహసీల్దార్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. కేంద్రీయ విద్యాల యానికి 12 ఎకరాల భూమి అవసరం ఉందని, సూదికొండ కింద ఉన్న స్థలాల ను ప్రస్తుతం గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు పునాదులు వేశారని, వారి ని గుర్తిస్తామన్నారు. ఇక్కడి స్థలాల్లో ఎవరికీ పట్టాలివ్వలేదని, గతంలో ఎక్సైజ్ పోలీస్టేషన్‌కు 25 సెంట్లు స్థలం మాత్రమే ఇచ్చామన్నారు. అయితే ఆ ప్రాంతంలో లేఅవుట్ మాదిరిగా పునాదులు వేశారని, వీటిని తొలగిస్తామని, అవసరమైతే ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేస్తామన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:46 PM