ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాబ్‌కార్డుల మంజూరుపై ప్రత్యేక దృష్టి

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:44 PM

జాబ్‌కార్డుల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జాబ్‌కార్డుల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మహాత్మగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అమలు, తదితర అంశాలపై సంబంధిత అదికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు నిండిన వారు రూరల్‌, అర్బన్‌ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. మండలాల వారీగా జారీ చేసిన జాబ్‌ కార్డులు, నిర్దేశిత లక్ష్యాలు, ప్రగతి, గ్రామసభల నిర్వహణపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. జాబ్‌కార్డుల మంజూరులో ఫిర్యాదులు వస్తే సంబంధిత ఏపీఓపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. మెళియాపుట్టి, కంచిలి, ఎల్‌.ఎన్‌.ఏట, ఇచ్ఛాపురం, పొందూరు, వజ్రపుకొత్తూరు ఏపీఓలు చేపట్టిన పనులను కలెక్టర్‌కు వివరించారు. వంశధార, బాహుదా, నాగావళి ఓపెన్‌ మెడ్‌ ఛానల్స్‌కి నీరు వెళ్లేందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మత్స్య సంపద పథకాలు నూరుశాతం అందాలి

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాలు లబ్ధిదారులకు శతశాతం అందేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అనుమతులు రాగానే ట్రాన్స్‌ఫాండర్లు శతశాతం రాయితీపై అందజేస్తామని తెలిపారు. వీటికోసం 48 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఫిషర్‌మెన్‌ అభివృద్ధి గ్రామాల కింద జిల్లాలో మూడు గ్రామాల్లో రూ.2కోట్ల చొప్పున ప్రతిపాదనలను తయారు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజు, ఎల్‌డీఎం సూర్యకిరణ్‌, మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ, డ్వామా పీడీ సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:44 PM