ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడలకు మరింత ఆదరణ పెరగాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:11 AM

జిల్లాలో క్రీడలకు మరిం త ఆదరణ పెర గాలని, ప్రోత్స హించేందుకు దాతలు ముందు కు రావాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరరావు పిలుపునిచ్చారు.

- రాష్ట్ట్రస్థాయి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: జిల్లాలో క్రీడలకు మరిం త ఆదరణ పెర గాలని, ప్రోత్స హించేందుకు దాతలు ముందు కు రావాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరరావు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఇండోర్‌ స్టేడియంలో జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ట్రస్థాయి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కరణం మల్లేశ్వరి, నీలం శెట్టి లక్ష్మి, పూజారి శైలజ వంటి క్రీడా దిగ్గజాలు జిల్లాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని గుర్తు చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కె.సాగర్‌ అధ్యక్షతన జరిగిన కా ర్యక్రమంలో కమిటీ ప్రతినిధులు డాక్టర్‌ గూడేన సోమేశ్వరరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు, ఏపీబీఏ చైర్మన్‌ చుక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంకమ్మ చౌదరి, జిల్లా చైర్మన్‌ ఆర్‌.రాజేంద్రన్‌, కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్‌, సీఈవో సంపతిరావు సూరిబాబు, ఉపాధ్యక్షులు ఎంఎం విలేఖరి, ఎం.రత్నాజీ, జి.ప్రసాద్‌, జిల్లా ఒలింపిక్‌ సంఘ సలహాదారు పి.సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధిలో వరం కృషి స్ఫూర్తిదాయకం

అరసవల్లి: సిక్కోలు నగరం అభివృద్ధిలో అంధవరపు వరహానర సింహం (వరం) అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. వరం జయంతిని పురస్కరించుకుని నగరంలోని వరం హైస్కూల్‌, ఏడురోడ్ల కూడలిలోని ఆయన విగ్రహాలకు పూలమాల వేసి శంకర్‌ నివాళులర్పించారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్‌లో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనం సమాజానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కళింగకోమటి జాతికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు చిరు వ్యాపారులకు 15 తోపుడు బండ్లను అందజేశారు. అలాగే అన్నా క్యాంటీన్‌కు రూ.3లక్షల విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు, కూటమి నాయకులు మాదారపు వెంకటేష్‌, అంబటి లక్ష్మీరాజ్యం, పాండ్రంకి శంకర్‌, పీవీ రమణ, కొర్ను నాగార్జున ప్రతాప్‌, మెండ దాసునాయుడు, కోరాడ సర్వేశ్వరరావు, పైడి వేణుగోపాలం, వరం కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:11 AM

Advertising
Advertising