ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ఠ చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Oct 31 , 2024 | 12:30 AM

సీఎం చంద్రబాబునాయుడు నవంబరు ఒకటిన ఇచ్ఛాపురం మండ లం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసు కోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఇచ్ఛాపురం : అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

టెక్కలి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు నవంబరు ఒకటిన ఇచ్ఛాపురం మండ లం ఈదుపురంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలు తీసు కోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు నిమ్మాడలోని తన కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో ఫోన్‌లో దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశముందని, వారికి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు, ప్రొటోకాల్‌, సభా ప్రాంగణానికి ఎటు వంటి ఇబ్బందులు లేకుండా చేరుకు నేటట్లు సౌకర్యాలు, వాహన పార్కింగ్‌పై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో ఫోన్‌లో సీఎం పర్యటన అంశాలపై మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు

ఇచ్ఛాపురం, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి): ఈదుపురంలో శుక్రవారం జరగనున్న ముఖ్య మంత్రి చంద్రబాబు సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ మేరకు బుధవారం హెలీపాడ్‌ పనులను ఎస్పీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ పఽథకం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో సంభా షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవోలు, సీఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:30 AM