జాతీయ ఆర్చరీ పోటీలకు తేజేశ్వరరావు
ABN, Publish Date - Jun 24 , 2024 | 11:43 PM
ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి నల్లి తేజేశ్వరరావు విలువిద్య (ఆర్చరీ)లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఎచ్చెర్లలో నివాసముంటున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మల్లేశ్వరరావు, అధ్యాపకురాలు వసంత లక్ష్మి దంపతుల కుమారుడు తేజేశ్వరరావు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపి కయ్యాడు. విశాఖపట్నం పరవాడలో ఎనిమిదో తరగతి చదువుతున్న తేజేశ్వరరావు చిన్నప్పటి నుంచి విలువిద్య పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలు, ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ -13 విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తేజేశ్వరరావును పలువురు అభినందిస్తున్నారు.
ఎచ్చెర్ల: ఎచ్చెర్లకు చెందిన విద్యార్థి నల్లి తేజేశ్వరరావు విలువిద్య (ఆర్చరీ)లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఎచ్చెర్లలో నివాసముంటున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మల్లేశ్వరరావు, అధ్యాపకురాలు వసంత లక్ష్మి దంపతుల కుమారుడు తేజేశ్వరరావు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపి కయ్యాడు. విశాఖపట్నం పరవాడలో ఎనిమిదో తరగతి చదువుతున్న తేజేశ్వరరావు చిన్నప్పటి నుంచి విలువిద్య పట్ల ఆసక్తి చూపుతున్నాడు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలు, ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ -13 విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తేజేశ్వరరావును పలువురు అభినందిస్తున్నారు.
Updated Date - Jun 24 , 2024 | 11:43 PM