గాయపడిన మహిళ మృతి
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:21 AM
మదనాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
గాయపడిన మహిళ మృతి
బూర్జ: మదనాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. మదనాపురం గ్రామానికి చెందిన మజ్జి నరసమ్మ (58) మంగళవారం రాత్రి చికెన్ కొట్టుకు వెళ్లి వస్తూ.. రోడ్డు దాటుతుండగా అదే సమయంలో బైక్‌పై వస్తున్న వ్యక్తి బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయ పడింది. చికిత్స కోసం ఆమెను 108 వాహనంలో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు..
పొందూరు/జి.సిగడాం: పొందూరు రైల్వేస్టేషన్ పరిధి జి.సిగడాం మండలం వాండ్రంగి రైల్వేగేట్ సమీపంలో బుధవారం రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు (20) మృతి చెందినట్టు జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూధనరావు తెలిపారు. మృతి చెందిన యువకుడు బ్లూ జీన్ ఫ్యాంట్, నాచు రంగు టీషర్టు ధరించాడని, చేతికి వాచి ధరించాడని మెడలో నలుపురంగు తాడు, తాయెత్తు ఉన్నాయన్నారు. సమాచారం కోసం 94934 74582 ఫోన్ నెంబరులో సంప్రదించాలన్నారు.
అనుమానాస్పదస్థితిలో ఒకరు..
మెళియాపుట్టి: బందపల్లి గ్రామానికి సమీపంలో గల మెళియాపుట్టి-టెక్కలి రోడ్డులో ఉన్న కల్వర్టులో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ టి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మం డలం రామపురం గ్రామానికి చెందిన బదకల కృష్ణుడు(58) శనివారం నర్సింగపల్లి లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లి వస్తానని భార్య దుర్గమ్మకు చెప్పి బయలుదేరాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కల్వర్టు వద్ద దుర్వాసన రావడంతో బందపల్లి గ్రామ స్థులు పరిశీలించారు. మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అంద జేశారు. కాగా కృష్ణుడు సారాకు బానిస కావడంతో తరచూ ఇటువైపు వస్తుంటాడని, తాగిన మైకంలో కల్వర్టుపై పడుకొని తూగి పడిపోయి మృతి చెంది ఉండొచ్చన్న అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరడి వద్ద మరొకరు..
కొత్తూరు: నేరడి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీ సుల కథనం మేరకు.. మురళీపేటకు చెందిన సనపల విష్ణు కార్పెంటర్, ఎలక్ర్టికల్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం నేరడిలో నిరుపయోగంగా ఉన్న పంపుషెడ్ నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు గుర్తించారు. విష్ణు మృతదేహం గుర్తించి వీఆర్వో శ్రీనుకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విష్ణు నాలుగు రోజులుగా ఇంటికిరాలేదని, మద్యం మత్తులో మృతి చెంది ఉండొచ్చని భార్య అన్నమ్మ ఫిర్యాదు మేరకు కొత్తూరు ఎస్‌ఐ ఎంఏ అహ్మద్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు. విష్ణుకి కుమారుడు మణికంఠ ఉన్నారు.
విష జ్వరంతో వృద్ధురాలు..
ఇచ్ఛాపురం: విషజ్వరాలు ప్రబలతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం డొంకూరు గ్రామానికి చెందిన పొన్నగంటి సీతమ్మ(70) విషజ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సీతమ్మ గత 15రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఇ చ్ఛాపురంలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో బుధ వారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృ తి చెందింది. సీతమ్మకు ఇద్దరు కుమారైలే ఉండడంతో.. చిన్న కుమారై చంద్రమ్మ చితికి నిప్పటించి దహన సంస్కారాలు పూర్తిచేశారు. కాగా డొంకూరులో ప్రటి ఇంటి లో జ్వరపీడితులు ఉన్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
నాగావళి నదిలో వ్యక్తి గల్లంతు
ఎచ్చెర్ల: పొన్నాడ గ్రామానికి చెందిన అంపోలు అ ప్పారావు (50) అనే వ్యక్తి నాగావళి నదిలో బుధవారం ఉద యం బట్టలు ఉతకడానికి వెళ్లి గల్లంతలయ్యాడు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. అప్పారావు తన భార్య లక్ష్మి, మరో ఇద్దరితో కలిసి వృత్తిలో భాగంగా బట్టలు ఉతికేందుకు నదికి వెళ్లాడు. బట్టలు ఉతికేందుకు వినియోగించే బండ రాయి ఇసుక మేట వేసి మునిగిపోవడంతో దానిని తీసేం దుకు ప్రయత్నించి.. వరద నీటికి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు అందరూ కలిసి సాయంత్రం వరకూ వెతికినా.. అప్పారావు ఆచూకీ లభించలేదు. దీంతో అప్పారావు భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. ఏఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పారావుకు భార్య లక్ష్మి, కుమారుడు ఎర్రన్నాయుడు ఉన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:21 AM