పేరుకే ‘మడ్డువలస’ ఆయకట్టు
ABN, Publish Date - Oct 31 , 2024 | 12:41 AM
ఈ ఏడాది కూడా వరి పంట చివరి దశలో రైతు లకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. సాగు నీటి కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణ ణాతీతం. చేతికి అంది వచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండడంతో రైతులు నిట్టూరుస్తున్నారు.
- రైతులకు తప్పని సాగునీటి కష్టాలు
జి.సిగడాం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది కూడా వరి పంట చివరి దశలో రైతు లకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. సాగు నీటి కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ణ ణాతీతం. చేతికి అంది వచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండడంతో రైతులు నిట్టూరుస్తున్నా రు. పక్కనే మడ్డువలస జలాశయం ఉన్నా ఆయకట్టు రైతులకు సాగునీరు గగణమైంది. దవళపేట, విజరాంపురం, సంతవురిటి, అనంద పురం, లబోతులపేట, గ్రామాలకు మడ్డువలస జలాశయం ద్వారా సాగునీరు అందక ఆయక ట్టు రైతులు అవస్థలు పడుతున్నారు. చెరువు ల్లో నీరు లేకపోవడంతో వరి పంట ఎండిపో తుందని రైతులు వాపోతున్నారు. రెల్లిగెడ్డ, పె ద్దగెడ్డల వద్ద ఉన్న ఆనకట్టల ద్వారా జగన్నాథ సాగరం, అసిరమ్మ చెరువు, దొరచెరువు, కంచ మ్మల చెరువు, కొత్త చెరువు, కాముని చెరవుల కు సాగునీరు రావాల్సి ఉన్నా ఆయా ఆనకట్టల వద్ద శాశ్వత నిర్మాణాలు లేకపోవడంతో సాగు నీరు వృథాగా పోతుందని దవళపేట మాజీ సర్పంచ్ కంచరాన సూరన్నాయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం పెద్దగెడ్డ వద్ద సుమారు 60 మంది రైతులతో కలిసి వృథాగా పోతున్న నీటిని మళ్లించేందుకు ఇసుక బాస్తాలను అడ్డు గా వేశామని ఆయన తెలిపారు. ఆ నీటిని చె రువులకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు తీర్చాలని, ఆనకట్టల వద్ద శాశ్వత పనులు చేపట్టాలని కో రారు. ఆయా గ్రామాల రైతులు కంచరాన సూ రన్నాయుడు, ఎం.శ్యామలరావు, పి.చిరంజీవి, పి.రాజారావు, సీహెచ్ అసిరినాయుడు, ఆబో తుల గొల్ల, పి.శేఖర్, ఎం.శ్రీరాములు తదిత రులు పాల్గొన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 12:41 AM