అమరవీరుల త్యాగాలు మరువలేనివి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:53 PM
ee
కంచిలి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని సోంపేట సీఐ బి.మంగరాజు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరిం చుకుని సాలినపుట్టుగకు చెందిన ఆర్‌ఎస్‌ఐ రమణమూర్తి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2008లో బలిమలలో జరిగిన సంఘటనలో రమణమూర్తి అమరుడైనట్లు తెలిపారు. అనంతరం రమణమూర్తి తండ్రిని కంచిలి ఎస్‌ఐ జి.రాజేష్‌తో కలసి దుస్సాలువతో సన్మానించారు.
Updated Date - Oct 21 , 2024 | 11:54 PM