అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:56 PM
ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్పూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనునిత్యం శాంతిభ ద్రతలను కాపాడుతున్న పోలీసులు దేశ అభివృద్ధిలో కీల క పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్పూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనునిత్యం శాంతిభ ద్రతలను కాపాడుతున్న పోలీసులు దేశ అభివృద్ధిలో కీల క పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజ రైన మంత్రి అచ్చెన్నాయుడు... కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావులతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్రంలో పోలీ సు వ్యవస్థ పనితీరుపై గర్వపడుతున్నాని చెప్పారు. నక్సలి జాన్ని అదుపు చేసి... శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమన్నారు. గంజాయి, మాద క ద్రవ్యాలను అరికట్టడాన్ని పోలీసులు సవాల్‌గా తీసు కుని పని చేయాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాం లో గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా విచ్చలవిడిగా జరిగిందని ఆరోపించారు. దీనిని అరికట్టేందుకు రాష్ట్రంలో నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి 500 మందితో ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అపహరణలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కు వగా ఉన్నాయని... వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులకు మంత్రి సూచించారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ... టెక్నాలజీ సాయంతో నేరస్తులను పట్టుకోవాలని కోరారు. పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలరషిప్ అందించే బాధ్యత తీసు కున్నామన్నారు. విధులలో చనిపోయి న పోలీసు కుటుంబ సభ్యులకు కారు ణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపారు. హోంగార్డులను అన్ని విధాలుగా ఆదుకుంటా మని... మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మంత్రి చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, ఉత్సవాలు, కొవిడ్ కట్టడి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని చెప్పారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మా ట్లాడుతూ ఈ ఏడాది కారుణ్య నియామకాల ద్వారా ఐదు గురికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అనంతరం అమరవీరు ల కుటుంబ సభ్యులకు మంత్రి అచ్చెన్నాయుడు సత్క రించారు. 2024లో విధి నిర్వహణలో మరణించిన ఉమా మహేశ్వరరావు, సతీష్, మాధవరావు, లక్ష్మణరావుల కుటుంబ సభ్యులకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలను మంత్రి అందించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలను ఆయన పరిశీలించారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన 216 మంది పేర్లతో జిల్లా పోలీసు శాఖ రూపొందించిన పుస్త కాన్ని ఎస్పీకి మంత్రి అందజేశారు. వారికి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ పి.శ్రీని వాసరావు, డీఎస్పీలు వివేకానంద, రాజశేఖర్, శేషాద్రి, ప్రసాద్, అమరవీరుల కుటుంబ సభ్యులు, సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:56 PM