ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పలాస కేంద్రంగా గంజాయి రవాణా

ABN, Publish Date - Dec 08 , 2024 | 12:24 AM

పలాస కేంద్రంగా గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 200 కిలోలకుపైగా గంజాయి పట్టుబడింది. అనుమానంతో వాహనాలు, బ్యాగులు తనిఖీ చేస్తే చాలు.. అందులో గంజాయి ఉంటుందనే నమ్మకం పోలీసుల్లో ఏర్పడింది. అయితే గంజాయితో పట్టుబడిన వారంతా కేవలం రోజువారి కూలీలు, బ్రోకర్లు మాత్రమే. దాన్ని పండించేవారు కానీ, విక్రయదారులు కానీ పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం.

గంజాయితో పట్టుబడిన నిందితులతో రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది (ఫైల్‌)

- వారం రోజుల వ్యవధిలో 200 కిలోలు లభ్యం

- మరింత నిఘా పెట్టిన పోలీసులు

పలాస, డి సెంబరు 7(ఆంధ్రజ్యోతి):

- పదేళ్ల కిందట పలాస రైల్వేస్టేషన్‌ వద్ద ఓ ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ స్థాయి అధికారే గంజాయిని ఏకంగా తన కార్యాలయంలోనే ప్యాకెట్లుగా తయారు చేశారు. రైలుమార్గం ద్వారా వాటిని హైదరాబాద్‌, బెంగుళూరు తరలించి పోలీసులకు పట్టుబడ్డారు. ఆయన కార్యాలయం నుంచి 200 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

- ఇటీవల జాతీయరహదారి లక్ష్మిపురం టోల్‌గేటు వద్ద ఒడిశా నుంచి వస్తున్న ఆయిల్‌ ట్యాంకును కాశీబుగ్గ పోలీసులు సోదాలు చేశారు. ట్యాంకులో పెట్రోల్‌కు బదులు టన్నున్నరకు పైగా గంజాయి ఉండడంతో నివ్వెరపోయారు. అంతకుముందు ఇదే టోల్‌గేటు వద్ద ఓ వ్యాన్‌ కింది భాగంలో కంటైనర్‌ ఏర్పాటు చేసి.. 200 కిలోలకుపైగా తరలిస్తున్న గంజాయి రవాణా గుట్టు రట్టయింది.

- పలాస కేంద్రంగా ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకూ(డిసెంబరు 6) మొత్తం ఏడు కేసులకు సంబంధించి 400 కిలోలకుపైగా గంజాయి స్వాధీనం చేసుకొని 18మందిని అరెస్టు చేశారు. వారిని విశాఖపట్నం కేంద్రకారాగానికి పంపించారు.

- తాజాగా శుక్రవారం పలాస రైల్వే పోలీస్టేషన్‌ పరిధి సోంపేట రోడ్డులో 118 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

..ఇలా పలాస కేంద్రంగా గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 200 కిలోలకుపైగా గంజాయి పట్టుబడింది. అనుమానంతో వాహనాలు, బ్యాగులు తనిఖీ చేస్తే చాలు.. అందులో గంజాయి ఉంటుందనే నమ్మకం పోలీసుల్లో ఏర్పడింది. అయితే గంజాయితో పట్టుబడిన వారంతా కేవలం రోజువారి కూలీలు, బ్రోకర్లు మాత్రమే. దాన్ని పండించేవారు కానీ, విక్రయదారులు కానీ పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. గంజాయి ఎక్కువగా ఆంధ్రా-ఒడిశా బోర్డరు మల్కన్‌గిరి, ఆర్‌.ఉదయగిరి, మోహన, గజపతి బ్లాకుల్లో ఉన్న మారుమూల కొండలు, అటవీ ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్నారు. గిరిజనులను పావులుగా వినియోగించుకొని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ బయానా ఇచ్చి గంజాయి పండిస్తున్నారు. పంట సిద్ధమైన తర్వాత రైతుల నుంచి బ్రోకర్లు ఒడిశా బోర్డరు వరకూ తీసుకువచ్చి.. అక్కడ నుంచి కూలీలు, చిన్నచిన్న బ్రోకర్లకు అప్పగిస్తారు. నిఘా లేకపోతే రైలుమార్గం, నిఘా ఎక్కువయితే రోడ్డు మార్గం గుండా గంజాయిని హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, ముంబాయి ప్రాంతాలకు తరలిస్తుంటారు. పది కిలోలకు ఒక్కో కూలీకి రూ.5వేల నుంచి రూ.10వేలు వరకూ ఇస్తుంటారని పట్టుబడిన కూలీలు చెబుతున్నారు. అయితే తమకు ఒరిజినల్‌ వ్యాపారి ఎవరనేది తెలియదని, కనీసం వారి ఫోన్‌ నెంబర్లు కూడా అందుబాటులో ఉండవని పేర్కొంటున్నారు. వ్యక్తులు వేసుకున్న దుస్తుల రంగులు, వారి ఎత్తు ఆధారంగా బ్రోకర్లు చెబితే.. ఆ ఆనవాళ్లు ప్రకారం సరకులు అందిస్తామని తెలిపారు.

- రాష్ట్ర ప్రభుత్వం గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. నిత్యం నిఘాతోపాటు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కాగా.. గంజాయి రవాణా వెనుక గూఢాచార్యం దాగి ఉంటుంది. కిలో రూ.3వేలకు కొనుగోలు చేసిన గంజాయి రవాణా పూర్తయిన తరువాత రూ.30వేల నుంచి రూ.50వేలు వరకు ధర పలుకుతుంటుంది. తక్కువ రిస్క్‌తో అధిక లాభాలు రావడంతో గంజాయినే వ్యాపారవస్తువుగా ఎంచుకున్నారన్నది స్పష్టమవుతోంది. ఒడిశాలో పండించిన గంజాయిని దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్న వేళ పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కేవలం మన జిల్లానుంచే కాకుండా విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, పాడేరు మన్యం ప్రాంతాల నుంచి కూడా ఒడిశా బోర్డురు నుంచి రవాణా జరుగుతున్న వ్యవహారంపై పూర్తిస్థాయి పర్యవేక్షణ అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్‌

గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఒడిసా సరిహద్దులో నిఘా పెట్టాం. గంజాయి ఆ ప్రాంతం నుంచి రాకుండా గట్టి చర్యలతో పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు నాటుసారా, బెల్టుషాపులపై కూడా దాడులు చేసి కేసులు పెట్టడానికి కూడా వెనుకాడేది లేదు.

డీఎస్పీ వి.వెంకటఅప్పారావు

Updated Date - Dec 08 , 2024 | 12:24 AM