ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జపాన్‌లో నర్సు ఉద్యోగాలకు శిక్షణ

ABN, Publish Date - Sep 14 , 2024 | 12:24 AM

ఏపీఎస్‌ఎస్‌డీసీ, నావిస్‌ హెచ్‌ఆర్‌ ఆధ్వ ర్యంలో ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి జపనీస్‌ భాష ఎన్‌-5, ఎన్‌-5, ఎన్‌-3 స్థాయిల్లో నేర్పించి వారికి జపాన్‌లో నర్సులుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎచ్చెర్ల: ఏపీఎస్‌ఎస్‌డీసీ, నావిస్‌ హెచ్‌ఆర్‌ ఆధ్వ ర్యంలో ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి జపనీస్‌ భాష ఎన్‌-5, ఎన్‌-5, ఎన్‌-3 స్థాయిల్లో నేర్పించి వారికి జపాన్‌లో నర్సులుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయిశ్రీనివాస్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 20-32 ఏళ్ల లోపు వయసు కలిగి, జపాన్‌లో పనిచేసేందు కు ఆసక్తి కలిగి ఉండాలన్నారు. బెంగళూర్‌లోని నావిష్‌ హెచ్‌ఆర్‌లో ఆరు నెలల శిక్షణ ఉంటుందన్నారు. మొత్తం శిక్షణ ఫీజు రూ.3.5 లక్షలు కాగా, పాక్షిక రుసుం రూ.50 వేలు అని చెప్పారు. పాక్షిక రుసుంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ రూ.25 వేలు చెల్లిస్తుందని, మిగిలిన 25 వేలను అభ్యర్థి చెల్లించాలన్నారు. అలాగే రూ.3 లక్షల శిక్షణా ఫీజు చెల్లిం పునకు సంస్థ బ్యాంకు రుణం సదుపాయం కల్పిస్తుంద న్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత జపాన్‌లో ఉద్యోగాల కల్పనకు ఏపీఎస్‌ఎస్‌డీసీ నావిస్‌ హెచ్‌ఆర్‌ సంస్థ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారికి నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం ఉంటుందన్నారు. మరిన్ని వివరాల 99888 53335, 77801 67645 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 12:24 AM

Advertising
Advertising