ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెట్లు విరిగి.. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి..

ABN, Publish Date - Jun 19 , 2024 | 11:22 PM

ఇచ్ఛాపురంలో మంగళవారం అర్ధరాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు విరుచుకుపడింది.

ఆటోపై పడిన చెట్లు

- ఇచ్ఛాపురంలో గాలీవాన బీభత్సం

- దెబ్బతిన్న వాహనాలు

-విద్యుత్‌ అంతరాయంతో ప్రజల ఇక్కట్లు

ఇచ్ఛాపురం, జూన్‌ 19: ఇచ్ఛాపురంలో మంగళవారం అర్ధరాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు విరుచుకుపడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్రగాలులతో ఎక్కడికక్కడే చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పట్టణ అంతా అంధకారం నెలకొంది. మునిసిపల్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం, పాతబస్టాండ్‌ జంక్షన్‌తోపాటు పలుచోట్ల భారీ చెట్లు నేలకూలడంతో పాటు 11 విద్యుత్‌ స్తంభాలు కుప్పకూలాయి. ఇంటిపైకప్పు రేకులు, రోడ్డుపైన ఉన్న బైకులు కూడా ఎగిరిపడ్డాయి. ఫకీరుపేటలో ఓ వైద్యుడి కారుపై భారీ చెట్టు పడడంతో ముందు భాగం దెబ్బతింది. పలుచోట్ల ఆటోలపై కూడా చెట్లు పడడంతో వాటికి కూడా నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి 11 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో మంచినీటి కోసం పట్టణవాసులు ఇబ్బందులుకు గురయ్యారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

Updated Date - Jun 19 , 2024 | 11:22 PM

Advertising
Advertising