రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:25 AM
మండల పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలి లా ఉన్నాయి..
కోటబొమ్మాళి: మండల పరిధిలోని జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలి లా ఉన్నాయి.. నందిగాం మండలం బ్రిడ్జిపల్లికి చెందిన పంద్ర నర్సింహులు, తన భార్య సరస్వతితో కలిసి ద్విచక్ర వాహనంపై కోటబొమ్మాళి వస్తుండగా ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరూ గాయప డ్డారు. వెంటనే వీరిని స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్య సేవలం దించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
‘ఎచ్చెర్ల’లో మరో వ్యక్తికి..
ఎచ్చెర్ల: ఎచ్చెర్ల పంచాయతీ రామ్‌నగర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్‌నగర్‌కు చెందిన జరుగుళ్ల భాస్కరరావు(40) ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల నుంచి తన ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. వెంటనే అతడి తొలుత శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఎస్‌ఐ వి.సందీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:25 AM