వీఆర్‌ఏల సంఘ జిల్లా అధ్యక్షుడిగా వెంకట అప్పారావు
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:53 PM
వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడి గా జి.వెంకటఅప్పారావు ఎన్నికయ్యారు.
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడి గా జి.వెంకటఅప్పారావు ఎన్నికయ్యారు. సోమవారం శ్రీకాకుళంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, కార్యదర్శి బీవీవీఎన్ రాజు, వీఆర్‌ఏల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గరికిపాటి బ్రహ్మయ్య, నాయకు లు రాఘవేంద్ర, సతీష్‌కుమార్, అప్పల స్వామి పర్యవేక్షణలో వీఆర్‌ఏల జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె.గోపి,సహాధ్యక్షుడిగా బాలకృష్ణ, ఉపాధ్య క్షులుగా జి.రమణ, జి.నాయుడు, ట్రెజరర్‌గా ఎస్.త్రినాథరావు, సహాయ కా ర్యదర్శిగా పి.ప్రసాదరావు, సీహెచ్‌అప్పన్నతో పాటు కార్య వర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:53 PM