ప్రగతి కోసం ‘పల్లె పండగ’: ఎమ్మెల్యే బగ్గు
ABN, Publish Date - Oct 19 , 2024 | 11:35 PM
పల్లెలు ప్రగతి పథంలో నడిపించేందుకు గాను కూటమి ప్రభుత్వం ‘పల్లె పండగ’ నిర్వహిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జలుమూరు, (సారవకోట)/పోలాకి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): పల్లెలు ప్రగతి పథంలో నడిపించేందుకు గాను కూటమి ప్రభుత్వం ‘పల్లె పండగ’ నిర్వహిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సారవకోట మండలం జమచక్రం, పోలాకి మండలం మబగాం, తలసముద్రం గ్రామాల్లో శనివా రం పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ పీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపీ నేతలు ధర్మాన తేజకుమార్, కత్తిరి వెంకటరమణ, చిన్నికృష్ణంనాయుడు, కాయరవి, సర్పంచ్ పి.శాంతి, ఎంపీటీసీ బైరి వరలక్ష్మి, ఎంపీడీవో మోహనకుమార్, తహసీల్దారు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి: వజ్జ
పలాసరూరల్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో కూటమి ప్రభుత్వంతోనే పంచాయతీలు, గ్రామా లు అభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శని వారం గరుడఖండి, లక్ష్మీపురం, పాతజగ దేవపురం గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరికట్ల విఠల్, టీడీపీ నాయకులు దువ్వాడ సంతోష్‌కుమార్, బడ్డ నాగరాజు పాల్గొన్నారు.
Updated Date - Oct 19 , 2024 | 11:35 PM