సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తా
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:14 AM
జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
అరసవల్లి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ సర్వజన ఆ సుపత్రిలో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షిం చారు. తొలుత ఆసుపత్రిలో తాగునీటికి ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లు, లిఫ్ట్‌లను పరిశీలించారు. అవిసరిగా పనిచేయ కపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సమీక్షించారు. ఆసుపత్రికి సంబంధించిన స మస్యలు, అవసరాలపై సమగ్ర నివేదిక తయా రుచేసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆసు పత్రి సూపరింటెండెంట్ దాసరి షకీలా, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రవి వెంకటాచలం, ఇతర ఆసుపత్రి అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే బలగలోని నాలుగు డివిజన్ల పరిధిలో జరుగు తున్న రోడ్లు మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అలాగే విశాఖ-ఏ కాలనీ పరిధి ఏడో లైను ఆర్టీసీ కాలనీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
Updated Date - Nov 30 , 2024 | 12:14 AM