ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన పక్షపాతి చంద్రబాబు: ధారు నాయక్‌

ABN, Publish Date - Nov 12 , 2024 | 05:14 AM

త వైసీపీ ప్రభుత్వం గిరిపుత్రుల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు తూతూమంత్రంగా చేసి గిరిజనులను అభివృద్ధికి దూరం చేసింది. కూటమి ప్రభుత్వం ఎస్టీలకు రూ.7,557 కోట్లు బడ్జెట్‌

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం గిరిపుత్రుల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు తూతూమంత్రంగా చేసి గిరిజనులను అభివృద్ధికి దూరం చేసింది. కూటమి ప్రభుత్వం ఎస్టీలకు రూ.7,557 కోట్లు బడ్జెట్‌ కేటాయించి ఎస్టీల పక్షపాతిగా, ఎస్టీల అభివృద్ధికి బాటలు వేసేదిగా నిలిచింది’ అని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షులు ధారు నాయక్‌ అన్నారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సీఎం చంద్రబాబు గిరిజన పక్షపాతి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఉసే లేదు. రోడ్ల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు లేక గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో డోలీలు కట్టుకుని కొండలు, గుట్టలు దాటాల్సి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిపుత్రుల అభివృద్ధికి శ్రీకారంచుట్టింది’ అని అన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 05:14 AM