ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏఎన్‌యూలో విద్యార్థినుల ఆందోళనబాట

ABN, Publish Date - Nov 30 , 2024 | 03:55 AM

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు.

పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు

పెదకాకాని, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. శుక్రవారం రాత్రి వర్సిటీలోని హాస్టల్‌ విద్యార్థినులు మహిళా హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్‌ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్‌లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారంక్రితం భోజనంలో కాళ్లజెర్రి వచ్చిందని, నాలుగు రోజుల క్రితం భోజనంలో కప్ప వచ్చిందని, గురు, శుక్రవారాలు రెండు రోజులు వరుసగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలని విద్యార్థినులు ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు రాత్రి 9గంటల నుంచి వీసీ చాంబర్‌ ఎదుటే బైఠాయించి నినాదాలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ విద్యార్థినుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.

Updated Date - Nov 30 , 2024 | 03:55 AM