ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీనివాస్ రమణీయ కమనీయ గ్రంధాలకు పవిత్ర స్పందన: ఈఓ రామారావు పర్యవేక్షణలో భక్తులకు వితరణ

ABN, Publish Date - Jul 07 , 2024 | 11:41 PM

భారతీయ సనాతన ధర్మంలోని మంత్ర శాస్త్రంలో పుష్కలంగా ఉన్న కొన్ని ప్రధానాంశాలతో, మరికొన్ని స్తోత్ర విద్యలతో, ఇంకొన్ని అందమైన వ్యాఖ్యానాలతో సుమారు మూడు వందల పేజీల శ్రీ సంపదగా ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్ర వైభవం’ను అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్త ధార్మిక కృషిని, రచనాపటిమను శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆలయ అర్చక, పండిత బృందాలు ముక్త కంఠంతో అభినందిస్తున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె .ఎస్. రామారావు పర్యవేక్షణలో శని, ఆదివారాలలో దేవస్థానానికి విచ్చేసిన వందలాది భక్తులకు ఈ అక్షర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది పంచడం భక్త సందోహాల్ని విశేషంగా ఆకర్షించింది.

విజయవాడ, జులై 7: భారతీయ సనాతన ధర్మంలోని మంత్ర శాస్త్రంలో పుష్కలంగా ఉన్న కొన్ని ప్రధానాంశాలతో, మరికొన్ని స్తోత్ర విద్యలతో, ఇంకొన్ని అందమైన వ్యాఖ్యానాలతో సుమారు మూడు వందల పేజీల శ్రీ సంపదగా ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్ర వైభవం’ను అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్త ధార్మిక కృషిని, రచనాపటిమను శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆలయ అర్చక, పండిత బృందాలు ముక్త కంఠంతో అభినందిస్తున్నాయి.

శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె .ఎస్. రామారావు పర్యవేక్షణలో శని, ఆదివారాలలో దేవస్థానానికి విచ్చేసిన వందలాది భక్తులకు ఈ అక్షర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది పంచడం భక్త సందోహాల్ని విశేషంగా ఆకర్షించింది.

ఈ సందర్భగా కె .ఎస్. రామారావు మాట్లాడుతూ సాధనాపరమైన జిజ్ఞాసకు సాధికారికమైన శాస్త్ర ప్రమాణాలను అందించే అద్భుత రచనలను, సంకలనాలను అందించడంలో అగ్ర స్థానం పురాణపండ వారిదేనని పేర్కొంటూ, పురాణపండ శ్రీనివాస్ కమనీయ రమణీయ గ్రంధాలకు ఆలయంలో అసాధారణమైన స్పందన లభించినట్లు చెప్పారు.

గత నలభై రోజులుగా శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో వరుసగా ఏడు ఆధ్యాత్మిక గ్రంధాలు ఆవిష్కరణ జరుపుకోవడం దుర్గమ్మ అనుగ్రహమేనని స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పేర్కొన్నారు.

ఆరెస్సెస్ సమావేశంలో రామారావుకు అభినందన

విజయవాడలో ఆదివారం ఉదయం ఘనంగా జరిగిన ఆరెస్సెస్ సమావేశానికి గౌరవ అతిధిగా హాజరైన శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె .ఎస్. రామారావును భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులు, శాసన సభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు ఆరెస్సెస్ ప్రముఖులు అభినందించటం విశేషం.

ఆరెస్సెస్ సభకి ఆత్మీయంగా హాజరైన రామారావు ప్రసంగం విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ గ్రంధాన్నిరామారావు కామినేని శ్రీనివాస్‌కి వినయ పూర్వకంగా పవిత్ర హృదయంతో బహూకరించడం అందరినీ ఆకట్టుకుంది.

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ఈ మంగళ గ్రంధాన్ని రామారావు బహూకరించడంతో అందరూ సామూహికంగా అపురూప గ్రంధాన్ని బహూకరించిన ఆయనని అభినందనలతో ముంచెత్తారు.

Updated Date - Jul 07 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<