Home » EO KS Ramarao
శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అత్యద్భుతంగా జరిగిన మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ ‘శ్రీదుర్గా వైభవం’ ఉపన్యాసాలలో, అనంతరం జరిగిన నృత్యవైభవాలలో ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేకసలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనం ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్రం’ గ్రంధాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం మొదలై కనకదుర్గమ్మ మరిన్ని మహోజ్వల కార్యాలు జరిపించుకోనున్న ఈ సందర్భంలో మరిన్ని గ్రంథావిష్కరణలు, ఉచిత వితరణలకు, మహాలక్ష్మీ ప్రదంగా జరుపనున్నట్లు సమాచారం. ఈ శ్రీవైభవానికి సహకరించి ప్రోత్సహించిన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, దేవాదాయ శాఖ కమీషనర్ సత్యనారాయణ, మహోపన్యాసకులు చాగంటి కోటేశ్వర రావుకు, ‘సౌభాగ్య’ లక్షప్రతులు సమర్పించి పవిత్ర సంచలనం సృష్టించిన నిస్వార్ధ సేవకులు బొల్లినేని కృష్ణయ్యకు, నాలుగు గ్రంధాల ఆవిష్కరణకు కారణమైన అద్భుతమైన రచయిత పురాణపండ శ్రీనివాస్‌కు, దేవస్థానంలో అన్ని విభాగాల ఉద్యోగులకు ఈఓ రామారావు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం సాయంకాలం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామస్తోత్రమ్’ మంగళగ్రంధాన్ని ఆవిష్కరించి.. స్వయంభూ క్షేత్రాలలో వేలకొలది అద్భుత గ్రంధాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యను అభినందించారు. అలాగే వివిధ శాస్త్రాల ప్రమాణంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ చేస్తున్న ధార్మిక చైతన్య కృషి వెనుక దైవబలం ఉందని, దైవబలం లేకుంటే ఇన్ని అపూర్వాలు సమాజానికి అందవని, పురాణపండ యజ్ఞకార్యాన్ని ఆయన ప్రశంసించారు.
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక అపురూప గ్రంధం ‘శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రమ్’ అనబడే సుమారు మూడు వందలపేజీల గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆనం జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఈ గ్రంధాన్ని ఆవిష్కరించి తొలిప్రతిని దేవస్థానం డిప్యూటీ కలెక్టర్ మరియు కార్య నిర్వహణాధికారి కె.ఎస్. రామారావుకు అందజేశారు.
భారతీయ సనాతన ధర్మంలోని మంత్ర శాస్త్రంలో పుష్కలంగా ఉన్న కొన్ని ప్రధానాంశాలతో, మరికొన్ని స్తోత్ర విద్యలతో, ఇంకొన్ని అందమైన వ్యాఖ్యానాలతో సుమారు మూడు వందల పేజీల శ్రీ సంపదగా ‘శ్రీ లలిత విష్ణు సహస్ర నామస్తోత్ర వైభవం’ను అందించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అవిశ్రాన్త ధార్మిక కృషిని, రచనాపటిమను శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ఆలయ అర్చక, పండిత బృందాలు ముక్త కంఠంతో అభినందిస్తున్నాయి. శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె .ఎస్. రామారావు పర్యవేక్షణలో శని, ఆదివారాలలో దేవస్థానానికి విచ్చేసిన వందలాది భక్తులకు ఈ అక్షర ప్రసాదాన్ని ఆలయ సిబ్బంది పంచడం భక్త సందోహాల్ని విశేషంగా ఆకర్షించింది.
వారాహి నవరాత్రుల పవిత్ర వేడుక సంరంభ సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ అపూర్వ రీతిలో ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంథం, మూడువందల పేజీల పరమ పవిత్ర స్తోత్ర, వ్యాఖ్యాన పారిజాతం ‘శ్రీ లలిత విష్ణు స్తోత్ర మంత్ర పేటిక’ను విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు వీణా వేడుక మధ్య సంగీతోత్సవానికి వెలుగుగా ఆవిష్కరించారు.