దైవ చింతనతోనే మానవుల మనుగడ
ABN, Publish Date - Nov 03 , 2024 | 11:36 PM
దైవ చింతనతోనే మానవుల మనుగడ సాధ్యమని కేంద్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు ఎస్. విజయభారతి అన్నారు.
కేంద్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు ఎస్. విజయభారతి
ఓర్వకల్లు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): దైవ చింతనతోనే మానవుల మనుగడ సాధ్యమని కేంద్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు ఎస్. విజయభారతి అన్నారు. ఆదివారం మండలంలోని కాల్వబుగ్గ సమీపాన గల సురభి గోశాల ట్రస్టు, భారతీయ స్ఫూర్తి కేంద్రంలో హిందూ కార్మిక వనభోజనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి వికాస భారతి సంఘటన కార్యదర్శి బీవీ నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ భక్తిభావం అలవర్చుకుంటే సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించవచ్చని అన్నారు. అనంతరం ఎస్.విజయభారతిని పూలమాలతో, దుశ్శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వనభోజన కార్యక్రమంలో భాగంగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో సురభి గోశాల ట్రస్టు అధ్యక్షుడు ఈఎస్ మారుతి కృష్ణనశర్మ, ప్రధాన కార్యదర్శి వంగాల నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 11:36 PM