ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువకుడి అనుమానాస్పద మృతి

ABN, Publish Date - Nov 24 , 2024 | 12:14 AM

నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెం కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌(23) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

నందికొట్కూరు రూరల్‌, నవంబరు 23 (ఆంధ్ర జ్యోతి): నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెం కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌(23) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నందికొట్కూరు మండలంలోని కొణిదేల గ్రామంలో ముచ్చుమర్రి గ్రామా నికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన నిలిపిన ఓ వాహనంలో యువకుడి మృతదేహం ఉండడాన్ని స్థానికులు చూసి యువకుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. యువకు డి తండ్రి దేవదాసు, తల్లి ఏస్తేరమ్మ, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయా లంటూ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మూడు రోజుల నుంచి కనిపించడం లేదని చెప్పారు. నందికొ ట్కూరు రూరల్‌ సీఐ సుబ్రహ్మణ్యం, పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి కుటుం బ సభ్యులతో చర్చించి న్యాయం జరిగేలా విచారణ చేపడ తామని తెలిపారు. దీంతో ధర్నా విరమించారు. కర్నూలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించి పరిశోధించారు. జాగిలా లు కనిపెట్టిన జాడపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొ ట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 24 , 2024 | 12:14 AM