ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు తీరిన ఫీజు కష్టాలు

ABN, Publish Date - Nov 21 , 2024 | 05:18 AM

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఇకపై కాలేజీలకే రీయింబర్స్‌మెంట్‌

ఈ ఏడాది నుంచే అమలు.. ఉత్తర్వులు జారీ

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ఐదేళ్లుగా పడుతున్న ఫీజు కష్టాల నుంచి వారిని గట్టెక్కించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసే విధానం తీసుకొచ్చింది. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే ఫీజులు(ఎస్సీ విద్యార్థులు మినహా) కాలేజీల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని పేర్కొంది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. కాగా, జగన్‌ హయాంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019కి ముందు ఫీజులను కాలేజీలకు జమ చేసే విధానం ఉండగా, పారదర్శకత పేరుతో జగన్‌ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు ఫీజులు ఇచ్చే విధానం తెచ్చింది.

అప్పటినుంచి విద్యార్థులకు ప్రభుత్వం చుక్కలు చూపించింది. ఏటా నాలుగు విడతల్లో ఫీజులు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క సంవత్సరం కూడా ఫీజులు సకాలంలో ఇవ్వలేదు. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల విడుదలతో తమకు సంబంధం లేదని, ముందుగానే కట్టించుకున్నాయి. దీంతో ఏటా ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు కట్టారు. ఆ తర్వాత ఎప్పుడో తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజులుపడేవి. 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమంటూ కాలేజీలు మెలిక పెట్టాయి. దీంతో స్తోమత లేనివారు అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. పాత విధానం పునరుద్ధరించి ఫీజుల సమస్య పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు పాత విధానం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Nov 21 , 2024 | 05:18 AM