ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: సుప్రీం తీర్పునకు వైసీపీ వక్ర భాష్యం: కనకమేడల

ABN, Publish Date - Jan 17 , 2024 | 02:38 PM

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వైసీపీ(YSRCP) వక్రభాష్యం పలుకుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) అన్నారు.

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వైసీపీ(YSRCP) వక్రభాష్యం పలుకుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) అన్నారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడుతూ.. "కోర్టు తీర్పులను కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి వైసీపీ, సాక్షి పత్రిక దిగజారింది. జస్టిస్ అనిరుద్ బోస్ ధర్మాసనం 82 పేజీల తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17ఏ వర్తింపునకు సంబంధించి ఇద్దరు జడ్జి లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. దీంతో ఈ అంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామని చెప్పారు.

లార్జర్ బెంచ్‌కి ఈ అంశాన్ని రిఫర్ చేయాలని కోరతామని పేర్కొన్నారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసు నమోదైంది. 2018 జులై 26న 17ఏ అమల్లోకి వచ్చింది. ఈ కేసులో 2018లో దర్యాప్తు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. జస్టిస్ అనిరుద్ బోస్..17ఏ వర్తించదు అని, జస్టిస్ భేలా త్రివేది.. ఈ సెక్షన్‌ వర్తిస్తుందన్నారు. అడ్వకేట్ జనరల్ స్థాయిలో ఉండి పొన్నావోలు సుధాకర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం తగదు. ఆయన వ్యాఖ్యలను కోర్టు చెప్పినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పకుంటా. సీఎం జగన్ కోర్టుల్లో స్టే తెచ్చుకుని పబ్బం గడుపుతున్నారు. ఆయన జేబుసంస్థ సీఐడీ చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టింది" అని కామెంట్స్ చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 03:52 PM

Advertising
Advertising