ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన టీడీపీ

ABN, Publish Date - Apr 13 , 2024 | 10:14 PM

వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానించింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు... కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే.

విజయవాడ: వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. ‘కోడి కత్తి కమలాసన్ ఈజ్ బ్యాక్!’ అని వ్యాఖ్యానించింది. దెబ్బతగిలిందని నటించబోయే ముందు... కెమెరా ముందు నటించేటప్పుడు అంటూ రెండు ఫొటోలను చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. కాగా ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారని వైసీపీ ఆరోపించిన విషయం తెలిసిందే. విజయవాడలో సీఎం వైయస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది.


జగన్‌పై రాయి దాడి.. స్వల్ప గాయం

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన చేపడుతున్న బస్సు యాత్రలో కలకలం రేగింది. శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటికి తగలడంతో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన జరిగింది.

Updated Date - Apr 13 , 2024 | 10:17 PM

Advertising
Advertising