Alapati Raja: తెనాలి సీటుపై వివాదం.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన టీడీపీ నేతలు
ABN, Publish Date - Feb 05 , 2024 | 06:54 PM
తెనాలి సీటు విషయమై టీడీపీలో వివాదం చెలరేగుతోంది. సీట్ల పంపకాల్లో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నట్టు సమాచారం.
గుంటూరు: తెనాలి సీటు విషయమై టీడీపీలో వివాదం చెలరేగుతోంది. సీట్ల పంపకాల్లో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇక టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా విషయానికి వస్తే ఆయన చాలా కాలంగా పార్టీని నమ్ముకున్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలిచారు.
అలాగే ఆలపాటి రాజాకు తెనాలి నియోజకవర్గంలోనూ మంచి పట్టుంది. దీంతో తెనాలి సీటును ఆలపాటి రాజాకే ఇవ్వాలంటూ టీడీపీ పట్టుబడుతోంది. గుంటూరులోని రాజా ఇంటికి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడతామని తెలిపారు. ఆలపాటి రాజా సర్ది చెప్పారు. టీడీపీ తనకు కన్నతల్లి లాంటిదని.. అన్యాయం చేయదనే నమ్మకంతో ఉన్నానన్నారు. 8వ తేది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని ఆలపాటి రాజా తెలిపారు. తొందరపాటు నిర్ణయాలు వద్దని ఆలపాటి రాజా చెప్పారు.
Updated Date - Feb 05 , 2024 | 07:42 PM