ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అండర్‌వేర్‌లో మొబైల్‌తో పరీక్షకు

ABN, Publish Date - Mar 18 , 2024 | 03:12 AM

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో సెల్‌ఫోన్‌తో కాపీయింగ్‌ చేస్తూ ఓ అభ్యర్థి దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ కాలేజీ సెంటర్‌లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు బేస్తవారపేటకు చెందిన బాలశివశంకర్‌ హాజరయ్యాడు.

కాపీకి పాల్పడుతుండగా పట్టివేత

ఒంగోలు (క్రైం), మార్చి 17: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో సెల్‌ఫోన్‌తో కాపీయింగ్‌ చేస్తూ ఓ అభ్యర్థి దొరికిపోయాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్విస్‌ కాలేజీ సెంటర్‌లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు బేస్తవారపేటకు చెందిన బాలశివశంకర్‌ హాజరయ్యాడు. పోలీసులు తనిఖీ చేసిన అనంతరమే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించినప్పటికీ వారి కళ్లుగప్పి మొబైల్‌ ఫోన్‌తో లోపలికి వెళ్లాడు. మొబైల్‌ సహాయంతో పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్‌ గుర్తించి ఫోన్‌ స్వాధీనం చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డీఎస్పీ కిషోర్‌బాబు సిబ్బందితో పరీక్షా కేంద్రానికి చేరుకొని బాలశివశంకర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బాలశివశంకర్‌ సెల్‌ఫోన్‌ను అండర్‌ వేర్‌లో పెట్టుకొని పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించినట్లు విచారణలో తెలిసిందన్నారు. అతనిపై మాల్‌ప్రాక్టీస్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Mar 18 , 2024 | 03:12 AM

Advertising
Advertising