టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి
ABN, Publish Date - Nov 16 , 2024 | 11:44 PM
నగరంలో టీడీపీ పార్టీ నేతల ఆడగాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వైసీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహనరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు అన్నారు.
- వైసీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు
కర్నూలు కల్చరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): నగరంలో టీడీపీ పార్టీ నేతల ఆడగాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని వైసీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహనరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డిలు అన్నారు. శనివారం నగరంలోని సీక్యాంపు సెంటర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను వారు నగర మేయర్ బీవై రామయ్యతో కలిసి పరిశీలించారు. వైసీపీ 23వ వార్డు నాయకులు సమస్యను వారి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని నగర మేయర్‌కు సూచించారు. ఈ సందర్భంగా వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి మాట్లాడుతూ కర్నూలులో ఎప్పుడూ లేని విధంగా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సీక్యాంపు సెంటర్‌లో ప్రజలకు, ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించే విధంగా షాపుల నిర్మాణాలను ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రోజురోజుకూ టీడీపీ నేతలు అక్రమ నిర్మాణాలకు, కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Updated Date - Nov 16 , 2024 | 11:44 PM